50 ఏళ్లు వచ్చినా.. దాన్ని మాత్రం ఆపను: రష్మిక

ABN , First Publish Date - 2020-12-15T02:57:56+05:30 IST

'యువర్‌ లైఫ్‌' అంటూ మెగా కోడలు ఉపాసన ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఎన్నో విషయాలను తను చెప్పడమే కాకుండా.. స్టార్‌ హీరోయిన్‌లతో కూడా చెప్పిస్తోన్న విషయం

50 ఏళ్లు వచ్చినా.. దాన్ని మాత్రం ఆపను: రష్మిక

'యువర్‌ లైఫ్‌' అంటూ మెగా కోడలు ఉపాసన ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఎన్నో విషయాలను తను చెప్పడమే కాకుండా.. స్టార్‌ హీరోయిన్‌లతో కూడా చెప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సమంతతో కొన్ని వంటలు చేయించి, ఫిట్‌నెస్‌ వివరాలను చెప్పించిన ఉపాసన.. ఇప్పుడు మరో స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నాతో ఫిట్‌నెస్‌ మంత్రని నిర్వహిస్తోంది. రష్మిక ఫిట్‌నెస్‌ వివరాలను తెలుపుతున్న ఓ వీడియోని తాజాగా ఉపాసన షేర్‌ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ఈ వీడియోలో రష్మిక తను ఎలాంటి వ్యాయామాలు చేస్తుందో చెప్పుకొచ్చింది. అలాగే ఫిట్‌నెస్‌ నిర్వచనం, దాని సంబంధింని లక్ష్యాలు, వ్యాయామం చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం వంటి విషయాలను తెలిపింది. పండగైనా సరే.. వ్యాయామం చేస్తానని, 50 ఏళ్ళ వయసులో కూడా ఇలానే వ్యాయామం చేసి, మంచి ఫిజిక్‌ ఉండేందుకు ప్రయత్నిస్తానని రష్మిక చెప్పుకొచ్చింది. ఇంకా రష్మిక ఏం చెప్పిందో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.





Updated Date - 2020-12-15T02:57:56+05:30 IST

Read more