పూనమ్‌ పాండే అసభ్య వీడియో.. కేసు నమోదు!

ABN , First Publish Date - 2020-11-04T20:01:05+05:30 IST

హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది.

పూనమ్‌ పాండే అసభ్య వీడియో.. కేసు నమోదు!

హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది. ఓ అసభ్య వీడియో కారణంగా ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను రూపొందించిందని,  ఆ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించిందని ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదులో పేర్కొంది. పూనమ్‌తోపాటు ఆ వీడియోను చిత్రీకరించిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-11-04T20:01:05+05:30 IST

Read more