‘న్యూ’స్‌

ABN , First Publish Date - 2020-06-29T09:49:13+05:30 IST

డిస్నీ సంస్థ నిర్మించిన హాలీవుడ్‌ చిత్రం ‘మూలాన్‌’ విడుదల కూడా మరోసారి వాయిదా పడింది. క్రిస్టోఫర్‌ నోలన్‌ ‘టెనెట్‌’ జూలై 30 నుంచి ఆగస్టు 12కు వెళ్లగా... ‘మూలాన్‌’ జూలై 21 నుంచి ఆగస్టు 21కి వెళ్లింది...

‘న్యూ’స్‌

డిస్నీ సంస్థ నిర్మించిన హాలీవుడ్‌ చిత్రం ‘మూలాన్‌’ విడుదల కూడా మరోసారి వాయిదా పడింది. క్రిస్టోఫర్‌ నోలన్‌ ‘టెనెట్‌’ జూలై 30 నుంచి ఆగస్టు 12కు వెళ్లగా... ‘మూలాన్‌’ జూలై 21 నుంచి ఆగస్టు 21కి వెళ్లింది.


కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత రామ్‌, కిశోర్‌ తిరుమల కలయికలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన చిత్రం ‘రెడ్‌’. కరోనా ప్రభావం తగ్గి థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత విడుదల చేయాలనుకుంటున్నారు.


‘ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌’ (డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్‌) కోసం ‘పవర్‌స్టార్‌’ సినిమా తీస్తున్నట్టు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. పవన్‌కల్యాణ్‌ పేరు ప్రస్తావించకుండా... ‘‘పీకే, రష్యన్‌ మహిళ’’ అనడం, పవన్‌ డూప్‌ను తీసుకొచ్చి ‘పవర్‌స్టార్‌’లో స్టార్‌ అనడం ద్వారా తాను ఎవరిని టార్గెట్‌ చేశారో అందరికీ తెలిసేలా వర్మ వ్యవహరించారు. ఆయన ప్రకటనతో హర్ట్‌ అయినట్టు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌ చేశారు.


Updated Date - 2020-06-29T09:49:13+05:30 IST