రవితేజ ‘ఖిలాడి’కి.. ‘కెజియఫ్’ టచ్
ABN , First Publish Date - 2020-12-23T23:12:48+05:30 IST
మాస్ మహారాజా రవితేజ సినిమాకి ‘కెజియఫ్’ టచ్ ఇస్తున్నారు. ఆయన హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఖిలాడి'. సత్యనారాయణ

మాస్ మహారాజా రవితేజ సినిమాకి ‘కెజియఫ్’ టచ్ ఇస్తున్నారు. ఆయన హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఖిలాడి'. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. జయంతీలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'ప్లే స్మార్ట్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ హై యాక్షన్ మూవీకి పాపులర్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఫైట్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. వీరితో పాటు మరో స్టంట్ మాస్టర్ల జోడీ కూడా ఈ సినిమాకు పనిచేస్తుంది.
'కేజీఎఫ్', 'ఖైదీ' లాంటి యాక్షన్ థ్రిల్లర్స్‌కు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అందించిన అన్బు-అరివు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. తాజాగా వీరిద్దరు టెక్నీషియన్ల బృందంలో జాయిన్ అయ్యారు. వీరు రవితేజ 'ఖిలాడి'కి ఒళ్లు గగుర్పాటు కలిగించే కొన్ని యాక్షన్ సీన్లను డిజైన్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు పనిచేస్తుండటంతో యాక్షన్ లవర్స్‌కు ఈ మూవీ మంచి ట్రీట్ కానుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లో నిర్మించిన ఓ భారీ జైలు సెట్‌లో ప్రస్తుతం కొన్ని ప్రధానమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో రవితేజ పాల్గొంటున్నారు. కీలకమైన ఈ జైలు ఎపిసోడ్స్, ప్రత్యేకించి అన్బు-అరివు ఆధ్వర్యంలో తీస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్.. 'ఖిలాడి'కి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ కానున్నాయని చిత్రయూనిట్ తెలుపుతోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.