ఇటలీ భయం...

ABN , First Publish Date - 2020-10-30T07:24:42+05:30 IST

ప్రపంచ దేశాలకు కరోనా బెడద ఇప్పట్లో తగ్గేలా లేదు. వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతోందని అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకుంటున్న...

ఇటలీ భయం...

ప్రపంచ దేశాలకు కరోనా బెడద ఇప్పట్లో తగ్గేలా లేదు. వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతోందని అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకుంటున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ మొదలు కావడం కలవరానికి గురి చేస్తోంది. ఇటలీలో కూడా రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుతో సన్నివేశాల చిత్రీకరణ కోసం మరోసారి ఇటలీ వెళ్లిన ‘రాధేశ్యామ్‌’ యూనిట్‌ ఇంకా అక్కడే ఉంది. ఇటలీలో కూడా లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశాలు ఉండడంతో వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకొని ‘రాధేశ్యామ్‌’  యూనిట్‌  ఇండియాకు తిరిగి వచ్చేస్తుందని అంటున్నారు. ఇదిలావుంటే నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘రంగ్‌దే’ చిత్రం పాటల్ని కూడా ఇటలీలో తీయడానికి మొదట ప్లాన్‌ చేశారు. అయితే ఇప్పుడు ఇటలీలో  పరిస్థితి చూసిన తర్వాత నిర్మాతల మనసు మారినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో కానీ, మరో సురక్షిత ప్రదేశంలో కానీ ఈ పాటల్ని తీయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-10-30T07:24:42+05:30 IST