`ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్` పూర్తి లుక్ విడుద‌ల‌!

ABN , First Publish Date - 2020-12-30T17:57:57+05:30 IST

సీనియర్ నటుడు జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్`.

`ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్` పూర్తి లుక్ విడుద‌ల‌!

సీనియర్ నటుడు జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్`. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మాణంలో డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 


టైటిల్‌లోని నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ల‌ను ఇప్పటికే విడివిడిగా విడుద‌ల చేశారు. తాజాగా నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ధారుల కంప్లీట్ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. జ‌గ‌ప‌తిబాబు (ఫాద‌ర్‌), బేబి స‌హ‌శ్రిత (చిట్టి), అమ్ము అభిరామి (ఉమా), కార్తీక్ (రామ్ కార్తీక్‌)లను ఒకే పోస్టర్‌లో చూపించారు. 

Updated Date - 2020-12-30T17:57:57+05:30 IST