సంజయ్‌దత్ లేటెస్ట్ లుక్..షాకవుతున్న ఫ్యాన్స్
ABN , First Publish Date - 2020-10-05T20:11:47+05:30 IST
తాజాగా సంజూబాబా లుక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమానితో సంజయ్ దత్ దిగిన ఈ ఫొటోలో.. ఆయన చాలా బలహీనంగా కనిపిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా సంజూబాబా లుక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమానితో సంజయ్ దత్ దిగిన ఈ ఫొటోలో.. ఆయన చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. కండలు తిరిగి, పుష్టిగా ఉండే లుక్‌తో కనపడే సంజూ బాబా లేటెస్ట్ లుక్‌ను చూసి ఆయన అభిమానులు షాకవుతున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంజయ్ ముంబైలోనే కీమో థెరపీ చికిత్సను తీసుకుంటున్నారు. మరోవైపు షూటింగ్స్‌లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు.