రామాయణం తెరకెక్కించాలంటూ రాజమౌళికి రిక్వెస్ట్

ABN , First Publish Date - 2020-05-04T14:35:02+05:30 IST

వ‌రుస సక్సెస్‌ల‌ను సాధించిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ‘బాహుబ‌లి’తో తెలుగు సినిమా రేంజ్‌ను మ‌రింత పెంచేశాడు. ప్ర‌స్తుతం ఈయ‌న తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

రామాయణం తెరకెక్కించాలంటూ రాజమౌళికి రిక్వెస్ట్

వ‌రుస సక్సెస్‌ల‌ను సాధించిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ‘బాహుబ‌లి’తో తెలుగు సినిమా రేంజ్‌ను మ‌రింత పెంచేశాడు. ప్ర‌స్తుతం ఈయ‌న తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈయ‌న‌కు మ‌హాభార‌తాన్ని సినిమాగా తెర‌కెక్కించాల‌నేది డ్రీమ్‌. అయితే ఇప్పుడు నెటిజ‌న్స్ నుండి రాజ‌మౌళికి స‌రికొత్త విన్నపాలు అందాయి. అవేంటంటే రామాయాణాన్ని డైరెక్ట్ చేయ‌మ‌ని. 1987లో రామానంద సాగ‌ర్ తెర‌కెక్కించిన రామాయ‌ణం సీరియ‌ల్‌ను లాక్‌డౌన్ వేళ పునః ప్ర‌సారం చేస్తే అత్య‌ధిక వీక్ష‌ణ‌లతో వ‌రల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేప‌థ్యంలో నెటిజ‌న్స్ హ్యాష్ ట్యాగ్ రాజ‌మౌళి మేక్ రామాయ‌ణ అంటూ ట్విట్ట‌ర్‌లో రిక్వెస్ట్‌లు పంపారు. ఇది ట్విట్ట‌ర్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ట్రెండ్ అయ్యింది. అయితే దీనిపై రాజ‌మౌళి ఏమీ స్పందించ‌లేదు. 

Updated Date - 2020-05-04T14:35:02+05:30 IST