ఆకట్టుకుంటున్న `ఫ్యామిలీ ప్యాక్` మోషన్ పోస్టర్!

ABN , First Publish Date - 2020-06-28T02:26:16+05:30 IST

కొంత టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా

ఆకట్టుకుంటున్న `ఫ్యామిలీ ప్యాక్` మోషన్ పోస్టర్!

కొంత టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె. ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌పై ఐదో సినిమాగా `ఫ్యామిలీ ప్యాక్` సినిమా తెరకెక్కుతోంది.


లిఖిత్ శెట్టి, అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ మోషన్ పోస్టర్ వైరల్‌గా మారింది. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాబోతోందట. డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాత పునీత్ రాజ్‌కుమార్‌ను తెలుగు నిర్మాతలు సంప్రదించారట. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం కూడా భారీ డిమాండ్ నెలకొందట. 

Updated Date - 2020-06-28T02:26:16+05:30 IST