ఎస్. జానకి ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2020-06-29T03:34:49+05:30 IST

భారతీయ నేపథ్య గాయనిగా అందరికీ పరిచయమైన సింగర్ ఎస్. జానకి. దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో

ఎస్. జానకి ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన కుటుంబ సభ్యులు

భారతీయ నేపథ్య గాయనిగా అందరికీ పరిచయమైన సింగర్ ఎస్. జానకి. దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆమె పాడారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. అయితే ఇకపై పాటలు పాడను అంటూ ఆ మధ్య ఎస్. జానకి ఓ స్టేజ్‌పై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి జానకమ్మ పాటలు పాడటం లేదు. తాజాగా ఆమె ఆరోగ్యంపై కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. ఆమె ఓ చిన్న ప్రాబ్లమ్ నిమిత్తం ఆపరేషన్ చేయించుకుని హాస్పటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటే.. ‘ఆమె ఇక లేరు’ అంటూ ఒక్కసారిగా వార్తలు వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు.


‘‘చిన్న ప్రాబ్లమ్ నిమిత్తం ఎస్. జానకిగారికి మైనర్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. బయట వినిపించే వార్తలను నమ్మవద్దు. ఆమె క్షేమంగా ఉన్నారు. దయచేసి ఇలాంటి వార్తలను పుట్టించవద్దు..’’ అని ఎస్. జానకి కుటుంబ సభ్యులు తెలిపారు. నటుడు మనోబాల కూడా ఎస్. జానకి ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. ఆమెకు ఏం కాలేదు. మైనర్ సర్జరీ జరిగింది అంతే. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త నిజం కాదు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు..’’ అని తెలిపారు.Updated Date - 2020-06-29T03:34:49+05:30 IST