ఫ్యామిలీ చందమామ

ABN , First Publish Date - 2020-12-29T09:52:24+05:30 IST

ఇష్టమైన వ్యక్తులను పొందాలంటే ముందు వాళ్లను ప్రేమించాలనీ, ప్రేమిస్తే వాళ్ల విలువ తెలుస్తుందని చెప్పే కథాంశంతో రూపొందిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’...

ఫ్యామిలీ చందమామ

ఇష్టమైన వ్యక్తులను పొందాలంటే ముందు వాళ్లను ప్రేమించాలనీ, ప్రేమిస్తే వాళ్ల విలువ తెలుస్తుందని చెప్పే కథాంశంతో రూపొందిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. దిలీప్‌, శ్రావణి జంటగా నటించారు. హరి గౌర సంగీతం, బాలాజీ సాహిత్యం అందించిన ఈ సినిమా పాటల్ని సోమవారం సి. కల్యాణ్‌ విడుదల చేశారు. ‘‘పక్కా కుటుంబకథా చిత్రమిది. అక్క, తమ్ముడు, బావ... ప్రతి ఒక్క బంధాన్ని పొల్చుకునేలా ఉంటుందీ సినిమా’’ అని చిత్రదర్శకుడు అనంద్‌ కానుమోలు చెప్పారు. ‘‘జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ’’ని నిర్మాత మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ, సాయి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T09:52:24+05:30 IST