మోర్‌ ఫన్‌తో...

ABN , First Publish Date - 2020-12-18T05:09:26+05:30 IST

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ నటీనటులుగా ‘ఎఫ్‌2 ’చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘ఎఫ్‌ 3’ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర....

మోర్‌ ఫన్‌తో...

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ నటీనటులుగా ‘ఎఫ్‌2 ’చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘ఎఫ్‌ 3’ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా, ప్రసాద్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. నిర్మాత దిల్‌రాజు గౌరవ దర్శకత్వం వహించారు.


దిల్‌రాజు, శిరీష్‌ మాట్లాడుతూ ‘‘2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్‌ 2’ప్రేక్షకుల్ని  నవ్వుల జల్లులో ముంచెత్తి ఘన విజయం సాధించింది. అన్నీ కుదిరితే ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తామని అప్పుడే ప్రకటించాం. అప్పటి నుంచీ దర్శకుడు అనిల్‌ ‘ఎఫ్‌ 3’ కోసం కథ సిద్థం చేేస పనిలో పడ్డారు. ప్రేక్షకుల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేయడానికి రాబోతున్నాం. ఈ నెల 23 నుంచి  రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’’ అని అన్నారు. ‘‘ఎఫ్‌2’కు మోర్‌ ఫన్‌ యాడ్‌ చేసి తీస్తున్న సినిమా ఇది. మరోసారి ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాం’’ అని అనిల్‌ రావిపూడి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం:  దేవిశ్రీ ప్రసాద్‌, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌, సహ నిర్మాత: హర్షిత్‌ రెడ్డి.

Updated Date - 2020-12-18T05:09:26+05:30 IST