'ఎఫ్‌2'కి అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2020-10-21T19:38:17+05:30 IST

2019 ఏడాదికిగానూ వివిధ భాషల్లోని 26 సినిమాలకు కేంద్ర సమాచారశాఖ ఇండియన్‌ పనోరమ అవార్డులను ప్రకటించింది.

'ఎఫ్‌2'కి అరుదైన గౌరవం

2019 ఏడాదికిగానూ వివిధ భాషల్లోని 26 సినిమాలకు కేంద్ర సమాచారశాఖ ఇండియన్‌ పనోరమ అవార్డులను ప్రకటించింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా ఎంపిక చేసిన ఈ అవార్డుల్లో తెలుగు చిత్రం 'ఎఫ్‌2.. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' టాలీవుడ్‌ నుండి ఈ అవార్డును దక్కించుకుంది. సినిమాతో పాటు దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఈ అవార్డును అందుకోనున్నారు.  దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేయగా దర్శకుడు అనీల్‌ రావిపూడి తన సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడమే కాదు.. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. సినిమాలో నటించిన వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ సహా నిర్మాతలకు స్పెషల్‌ థాంక్స్‌ చెప్పారు అనీల్‌ రావిపూడి. 
Updated Date - 2020-10-21T19:38:17+05:30 IST