ఏప్రిల్ 24న ‘ఎక్స్‌ట్రాక్షన్’
ABN , First Publish Date - 2020-04-16T03:34:28+05:30 IST
యాక్షన్, డ్రామా, ప్రేమ వంటి ఎలిమెంట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న సినిమా ‘ఎక్స్‌ట్రాక్షన్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 24న ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నారు.

యాక్షన్, డ్రామా, ప్రేమ వంటి ఎలిమెంట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న సినిమా ‘ఎక్స్‌ట్రాక్షన్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 24న ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఓ అంతర్జాతీయ నేర సామ్రాజ్యాధిపతి జైల్లో ఉంటాడు. అతని కొడుకును కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ అబ్బాయిని కాపాడటానికి భయమంటే తెలియని బ్లాక్ మార్కెట్ మెర్సినరీ టేలర్ రేక్ చేసిన ప్రయాణమే ఈ సినిమా. ఆయుధాల డీలర్లు, మాదకద్రవ్యాల వ్యాపారుల కార్యకలాపాల నేపథ్యంలో ఇదొక అసాధ్యమైన మిషన్‌గా మారుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సామ్ హార్ గ్రేవ్ దర్శకత్వం వహించారు. ఏజీబీవో ఫిలింస్, టీజీఐఎం ఫిలింస్ పతాకాలపై జో రుసొ, ఆంటోనీ రుసో, మైక్ లా రోక్కా, క్రిస్ హెమ్స్ వర్త్, ఎరిక్ గిట్టర్, పీటర్ షెవ్రిన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో భారతీయ నటులు ప్రియాంశు పైన్యూలి, రణదీప్ హూడా, రుద్రాక్ష్ జైస్వాల్, పంకజ్ త్రిపాఠి కూడా నటించారు.