ఆమె సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే కాదు.. తల్లి కన్నా ఎక్కువ: నిర్మాత సందీప్ సింగ్

ABN , First Publish Date - 2020-06-28T01:17:16+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...

ఆమె సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే కాదు.. తల్లి కన్నా ఎక్కువ: నిర్మాత సందీప్ సింగ్

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి ఆత్మహత్యకు సంబంధించి పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రేమ, పెళ్లి వ్యవహరాల వల్లే అతడు ఈ అఘాయిత్యం చేసుకున్నాడని కొందరు భావిస్తున్నారు. దీనికి సంబంధించి సుశాంత్ స్నేహితుడు, సినీ నిర్మాత సందీప్ సింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘సుశాంత్, రియా చక్రవర్తిల వివాహం గురించి నాకు తెలియదు. అయితే అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ అంకిత లోఖండే మాత్రం చాలా మంచిది. సుశాంత్‌ను గొప్పగా అర్థం చేసుకుంది. అంకిత సుశాంత్‌కు గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే కాదు. అతడిని తల్లిలా చూసుకునేది. అతడి కోసం దాదాపు తన కెరీర్‌నే త్యాగం చేసింది. ఆమెనే సుశాంత్ వివాహం చేసుకోవాలనుకున్నాడు కూడా. నాకు తెలిసి అదే అతడి చివరి రిలేషన్‌షిప్’ అని సందీప్ చెప్పుకొచ్చాడు.


సుశాంత్ ఆత్మహత్యకు డిప్రెషన్‌ మాత్రమే కారణమై ఉండవచ్చని, అతడితో తాము ఎప్పుడూ సన్నిహితంగానే ఉండే వారిమని, కానీ ఆత్మహత్య ఆలోచన కూడా ఉన్నట్లు ఏనాడూ సుశాంత్ చెప్పలేదని సందీప్ తెలిపాడు. అయితే ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు వాటిని దాదాపు బయటపెట్టరని, సుశాంత్ కూడా అదే చేశాడని చెప్పాడు. తనకు ఏ మాత్రం దీని గురించి తెలిసి ఉన్నా సుశాంత్‌ను కాపాడుకోగలిగేవాడినని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-06-28T01:17:16+05:30 IST