మన దేశంలో కూడా...

ABN , First Publish Date - 2020-07-03T05:06:42+05:30 IST

‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడంతా ఓ భారీ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. 200 మిలియన్‌ డాలర్ల వ్యయంతో రూపుదిద్దుకొని, వచ్చే నెలలో అమెరికాలో విడుదలయ్యే ఆ చిత్రాన్ని...

మన దేశంలో కూడా...

‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడంతా ఓ భారీ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. 200 మిలియన్‌ డాలర్ల వ్యయంతో రూపుదిద్దుకొని, వచ్చే నెలలో అమెరికాలో విడుదలయ్యే ఆ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారా లేదా అని సినిమా జనం కూడా వెయిట్‌ చేస్తున్నారు. రిస్క్‌ చేసి ప్రేక్షకులు వస్తే కనుక మిగిలిన దేశాల్లో కూడా థియేటర్లు ఓపెన్‌ చేసే అవకాశం ఉంటుంది’ అన్నారు సురేశ్‌బాబు. ఇటీవల ఆయన ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘టెనెట్‌’ సినిమా గురించి అలా చెప్పారు. క్రిస్టఫర్‌ నోలన్‌ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల్లోనే విడుదల కావాలి. అయితే కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆగస్టు 12కు వాయిదా వేశారు. తాజా సమాచారం ఏమిటంటే ‘టెనెట్‌’ మన దేశంలో కూడా విడుదల కానుంది. ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరుణ్‌ ఆదర్స్‌ ఈ విషయం ట్వీట్‌ చేశారు. అయితే విడుదల తేదీ ఎప్పుడన్నది ఇంకా ఫైనలైజ్‌ కాలేదని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మించింది.

Updated Date - 2020-07-03T05:06:42+05:30 IST