కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇస్తానన్నా, శివసేనను ఎంచుకున్నాను...సినీనటి ఉర్మిళ

ABN , First Publish Date - 2020-12-02T13:26:47+05:30 IST

బాలీవుడ్‌ నటి, కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్‌ శివసేనలో చేరికపై తాజాగా వ్యాఖ్యలు చేశారు.....

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇస్తానన్నా, శివసేనను ఎంచుకున్నాను...సినీనటి ఉర్మిళ

ముంబై : బాలీవుడ్‌ నటి, కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్‌ శివసేనలో చేరికపై తాజాగా వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని చెప్పినా, తాను మాత్రం శివసేనను ఎంచుకున్నానని ఊర్మిళా చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పినా, దాన్ని తిరస్కరించి శివసేనలో చేరానని ఆమె పేర్కొన్నారు. శివసేనలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఊర్మిళా ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయానని తాను కాంగ్రెస్ నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు. తనకు ఓటమిని ఎదుర్కొనే ధైర్యముందని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడినా తనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వంటి సీనియర్ నాయకుల పట్ల ఇంకా గౌరవం ఉందన్నారు. 


కాంగ్రెస్ నుంచి శివసేనకు సైద్ధాంతిక మార్పు గురించి ప్రశ్నించగా ‘‘నేను పుట్టుకతో హిందువును, నా మతం హిందూ మతాన్ని ప్రేమించమని, ఇతర మతాలను ద్వేషించమని ఎప్పుడూ చెప్పలేదు. శివసేన హిందూ పారట్ీ అయినా ఇతరులకు మంచి చేయాలని చూస్తున్న పార్టీ అని నమ్ముతున్నాను’’ అని ఊర్మిళా వివరించారు. కంగనారనౌత్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు శివసేన నుంచి ఎమ్మెల్సీ లభించిందా అని ప్రశ్నిస్తే ఠాక్రే కోసం ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని ఊర్మిళా చెప్పారు. 2019లో ఊర్మిళా మటోండ్కర్ ఉత్తర ముంబై నుంచి బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. అంతకు ముందు ఊర్మిళా మాతో శ్రీలో ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివసేన తీర్థం స్వీకరించారు.

Updated Date - 2020-12-02T13:26:47+05:30 IST