చిత్రకారిణిగా కూడా!

ABN , First Publish Date - 2020-08-27T05:34:53+05:30 IST

‘జాన్వీ... నటనలోనే కాదు చిత్రకారిణిగా కూడా మీకు మంచి మార్కులే పడతాయి, మీరు మంచి ఆర్టిస్ట్‌’ అంటూ జాన్వీకపూర్‌పైన ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఓటీటీలో...

చిత్రకారిణిగా కూడా!

‘జాన్వీ... నటనలోనే కాదు చిత్రకారిణిగా కూడా మీకు మంచి మార్కులే పడతాయి, మీరు మంచి ఆర్టిస్ట్‌’ అంటూ జాన్వీకపూర్‌పైన ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఓటీటీలో విడుదలైన ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రం సక్సెస్‌ను జాన్వీకపూర్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. రాజ్‌కుమార్‌ రావుకు జోడీగా జాన్వీ నటించిన ‘రూహీ అఫ్జానా’ చిత్రాన్ని ఏప్రిల్‌లోనే విడుదల చేయడానికి ప్లాన్‌ చేసినా కరోనా వల్ల వాయిదాపడింది. ప్రస్తుతం కొంత విరామం దొరకడంతో తన ఆసక్తిని తీర్చుకుంటున్నారు జాన్వీ. మంచి పెయింటర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికను నెరవేర్చుకునేందుకు పెయింటింగ్‌లు వేస్తూ తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. జాన్వీ తను గీసిన పలు చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. 

Updated Date - 2020-08-27T05:34:53+05:30 IST