వర్మా... ఇదేం ఖర్మ!!

ABN , First Publish Date - 2020-06-10T23:01:39+05:30 IST

టాలీవుడ్‌లో కొద్ది కాలం క్రితం టాప్ పొజిషన్‌లో ఉన్న స్టార్ డైరెక్టర్స్‌లో అనేకమంది రామ్ గోపాల్ వర్మ శిష్యులే. ఒకే ఒక్క సినిమా ...

వర్మా... ఇదేం ఖర్మ!!

టాలీవుడ్‌లో కొద్ది కాలం క్రితం టాప్ పొజిషన్‌లో ఉన్న స్టార్ డైరెక్టర్స్‌లో అనేకమంది రామ్ గోపాల్ వర్మ శిష్యులే. ఒకే ఒక్క సినిమా 'శివ'తో ఓవర్ నైట్ క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న వర్మ... ఇప్పుడు తీస్తున్న సినిమాలను చూసి... 'వర్మ నీకిదేం ఖర్మ' అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇటీవల వర్మ తీసిన కొన్ని సినిమాలలో మితిమీరిన శృంగార దృశ్యాలు ఉన్నాయి. వాటికి సెన్సార్ చిక్కులు తప్పనిసరి అని గ్రహించిన వర్మ...  సెన్సార్ లేని సోషల్ మీడియాను తన చిత్రాల ప్రదర్శనకు వేదికగా ఎంపిక చేసుకున్నాడు. అలా వచ్చిన తొలి చిత్రం 'క్లయిమాక్స్'. శృంగారతార మియా మల్కోవాతో వర్మ తీసిన 'క్లయిమాక్స్'ను ఓ యాప్ ద్వారా విడుదల చేశాడు. వంద రూపాయలు చెల్లించి చూసే ఆస్కారం ఉన్న దీనికి తొలి రోజునే లక్షకు పైగా వ్యూస్ రావడంతో వర్మలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది. 


'క్లయిమాక్స్' కథలో అసలు కొత్తదనమే లేకపోవడంతో మియా అందాలనే యువతకు ఎరగా వేశాడు వర్మ. ఇప్పుడు అదే బాటలో 'నకెడ్' మూవీని తీశాడు.  రాజమౌళి తన 'ట్రిపుల్‌ఆర్'కు 'రౌద్రం - రణం - రుధిరం' అని అబ్రివేషన్ ఇచ్చినట్టుగా వర్మ తన చిత్రానికి 'నేకెడ్ - నగ్నం - నంగా' అనే పేరు పెట్టాడు. పైగా ఇది రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' కాదు... వర్మ 'ఎన్‌ఎన్‌ఎన్' అని చెబుతున్నాడు. ఒకప్పుడు వర్మ ను అందరూ గొప్పగా అనుసరిస్తే ఇప్పుడీ డైరెక్టర్... రాజమౌళి పేరును అడ్డం పెట్టుకుని ఇలా చీప్ పబ్లిసిటీ చేసుకోవడం ఏం బాలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 'నేకెడ్' ట్రైలర్ చూసి... చీదరించుకుంటున్నారు. మరి వర్మ.. ఈ పంథా నుండి ఎపుడు బయటపడతాడో చూడాలి.

Updated Date - 2020-06-10T23:01:39+05:30 IST