వినోదం పంచే అంకుల్స్‌

ABN , First Publish Date - 2020-12-27T11:04:11+05:30 IST

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో

వినోదం పంచే అంకుల్స్‌

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’.  ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్‌ ఫ్రెండ్స్‌- బొడ్డు అశోక్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో బెల్లంకొండ సురేశ్‌, అచ్చిరెడ్డి, యంఎల్‌ కుమార్‌ చౌదరి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇ. సత్తిబాబు మాట్లాడుతూ ‘‘పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమిది. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది’’ అని అన్నారు. 


నిర్మాత శ్రీవాస్‌ మాట్లాడుతూ ‘‘డార్లింగ్‌ స్వామి చెప్పిన పాయింట్‌ నచ్చి గుడ్‌ సినిమా టీమ్‌తో ఈ సినిమా చేస్తున్నా. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు. 

Updated Date - 2020-12-27T11:04:11+05:30 IST