ప్రకృతిని ఆస్వాదిస్తూ...

ABN , First Publish Date - 2020-10-05T07:55:25+05:30 IST

సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపే సినీనటులకు కాస్త ఖాళీ దొరికితే చాలు మనసుకు నచ్చిన పనుల్లో మునిగిపోతారు. ఆన్‌స్ర్కీన్‌ ఫుల్‌ ఎనర్జీతో అభిమానులను రీఛార్జ్‌ చేసే...

ప్రకృతిని ఆస్వాదిస్తూ...

సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపే సినీనటులకు కాస్త ఖాళీ దొరికితే చాలు మనసుకు నచ్చిన పనుల్లో మునిగిపోతారు. ఆన్‌స్ర్కీన్‌ ఫుల్‌ ఎనర్జీతో అభిమానులను రీఛార్జ్‌ చేసే సాయిపల్లవి కూడా అదే బాటను ఎంచుకున్నట్టున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు. పచ్చికలో కూర్చొని ప్రశాంతతను అనుభవిస్తూ, చెట్టు ఊడను పట్టుకుని ఊయల ఊగుతున్న ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతాన్ని నిజం చేసేందుకు...’ అని ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చారు సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘లవ్‌స్టోరీ’, ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Updated Date - 2020-10-05T07:55:25+05:30 IST

Read more