ట్రాన్స్ జెండర్‌గా మారిన ఆస్కార్‌ స్టార్

ABN , First Publish Date - 2020-12-03T02:50:32+05:30 IST

సూప‌ర్‌హీరో క‌థ‌తో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఎక్స్‌మెన్‌’. ఈ సినిమాలో కిట్టి ప్రైడ్ అనే పాత్ర‌లో మెప్పించిన న‌టి ఎలియట్ పేజ్ తానొక ట్రాన్స్‌జెండ‌ర్‌నంటూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు.

ట్రాన్స్ జెండర్‌గా మారిన ఆస్కార్‌ స్టార్

సూప‌ర్‌హీరో క‌థ‌తో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఎక్స్‌మెన్‌’. ఈ సినిమాలో కిట్టి ప్రైడ్ అనే పాత్ర‌లో మెప్పించిన న‌టి ఎలియట్ పేజ్ తానొక ట్రాన్స్‌జెండ‌ర్‌నంటూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఎలియట్ పేజ్ ‌చేసిన ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇప్పుడు హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ట్రాన్స్‌జెండ‌ర్‌న‌ని చెప్పుకోవ‌డానికి త‌న‌కు ఇబ్బంది లేద‌ని, ఓ రకంగా గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని ఎలియట్  తెలిపారు. ఈ జ‌ర్నీలో త‌న‌కు తోడుగా నిలిచిన ట్రాన్స్ క‌మ్యూనిటీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు ‌. ఇలా చెప్ప‌డం వ‌ల్ల తానేమీ ఫీల్ కావ‌డం లేద‌ని, ఇక‌పై త‌న‌కు న‌చ్చిన‌ట్లు ఉండే అవ‌కాశం ద‌క్కించ‌ని ఎలియట్ తెలిపారు. అదే స‌మ‌యంలో ట్రాన్ కమ్యూనిటీ ఆరోగ్యంపై ఆశ్ర‌ద్ధ వ‌హించే రాజ‌కీయ నాయ‌కుల వైఖ‌రి ఎలియట్ త‌ప్పు ప‌ట్టారు. ట్రాన్స్ క‌మ్యూనిటీ ప‌ట్ల రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌వ‌ర్తించే తీరు వ‌ల్ల‌నే వారిలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంద‌ని ఎలియట్ తెలిపారు. 


ఎలియట్ ట్రాన్స్ జెండ‌ర్ అని ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న అంబ్రిల్లా అకాడ‌మీ సిరీస్‌లో త‌న పాత్ర ప‌రంగా ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని మేక‌ర్స్ తెలిపారు. ధైర్యంగా విష‌యాన్ని చెప్పిన ఎలియట్ నిర్ణ‌యాన్ని తాము గౌర‌విస్తున్న‌ట్లు వారు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలియట్‌కు మ‌ద్ధ‌తు పెరుగుతుంది. ఎలియట్ భార్య ఎమ్మ‌పోర్ట‌న‌ర్ కూడా త‌న మ‌ద్ద‌తుని తెలియ‌జేయ‌డం విశేషం. నాన్ బైన‌రీ వ‌ర్గానికి చెందినవారు ఈ ప్ర‌పంచానికి బహుమ‌తులు అని చెప్పిన ఎమ్మా పోర్ట్‌న‌ర్‌.. ఎలేన్ వ్య‌క్తిగ‌త నిర్ణ‌యంపై అంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని కోరింది. ఎక్స్‌మెన్ చిత్రంలో కిట్టీ ప్రైడ్ పాత్ర చేయ‌డం ద్వారా ఎలియట్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ద‌క్కింది. త‌ర్వాత ఎఎలియట్ నిర్మాత‌గా మారారు. హార్డ్ క్యాండీ సినిమాను రూపొందించిన ఉత్త‌మ‌న‌టి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక 2007లో విడుద‌లైన ‘జూనో’ చిత్రంతో ఎలియట్‌కు మంచి క్రేజ్‌తో పాటు గుర్తింపు కూడా ద‌క్కింది. ఈ సినిమాలో ఎలియట్ టిల్‌రోల్‌ను పోషించారు. ఈ సినిమాలో న‌ట‌న‌కు ఎలేన్ ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యారు. 
Updated Date - 2020-12-03T02:50:32+05:30 IST