శింబు కొత్త పోస్టర్‌ అదుర్స్‌!

ABN , First Publish Date - 2020-10-27T00:19:02+05:30 IST

తమిళ నటుడు సిలంబరసన్‌ టీఆర్‌ అలియాజ్‌ శింబు అభిమానులకు విజువల్ ట్రీట్ అందించడానికి సిద్ధమయ్యాడు. సుశీంతిరన్‌ దర్శకత్వంలో శింబు నటిస్తున్న తాజా సినిమా ఈశ్వరన్‌కు...

శింబు కొత్త పోస్టర్‌ అదుర్స్‌!

తమిళ నటుడు సిలంబరసన్‌ టీఆర్‌ అలియాజ్‌  శింబు అభిమానులకు విజువల్ ట్రీట్ అందించడానికి సిద్ధమయ్యాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో శింబు నటిస్తున్న తాజా సినిమా ఈశ్వరన్‌కు సంబంధించిన ఓ మోషన్‌ పోస్టర్‌ నేడు విడుదలైంది. దీనిపై శింబు ఫాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన శింబు బాగా లావుగా మారిపోయాడు. అయితే ఇటీవల శింబు లావు తగ్గేందుకు ఎంతో కష్టపడ్డాడు. దీంతో ఈ పోస్టర్‌లో శింబు మళ్లీ మునుపటిలా సన్నగా కనపడ్డాడు. గుబురు గడ్డంతో తలగుడ్డ కట్టుకుని మెడలో తాచుపాము వేసుకుని సీరియస్‌ లుక్‌తో కనిపిస్తున్నాడు శింబు. 


ప్రస్తుతం ఈ పోస్టర్‌ శింబు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. తమ హీరో మళ్లీ మునుపటిలా కనిపిస్తుండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌లో #Eeswaran హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రండ్‌ అవుతోంది. రెండు గంటల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై 30వేల వరకు ట్వీట్లు పోస్టయ్యాయి.

Updated Date - 2020-10-27T00:19:02+05:30 IST