తెలుగమ్మాయ్‌.. తక్కువేం కాదు

ABN , First Publish Date - 2020-10-05T02:51:30+05:30 IST

తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు ఇవ్వరు అంటూ తెలుగు హీరోయిన్లు ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పి ఉన్నారు. కొందరు టాలీవుడ్

తెలుగమ్మాయ్‌.. తక్కువేం కాదు

తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు ఇవ్వరు అంటూ తెలుగు హీరోయిన్లు ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పి ఉన్నారు. కొందరు టాలీవుడ్ వదిలి కోలీవుడ్‌లో సక్సెస్ అయినవారూ ఉన్నారు. ఇప్పుడున్న ఒకరిద్దరికి అవకాశాలు వస్తున్నా.. నిలబడలేని పరిస్థితి. అందుకు కారణాలు అనేకం. అయితే టాలీవుడ్‌లో తెలుగమ్మాయిగా.. క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో బిజీ నటిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈషా రెబ్బా. ప్రస్తుతం ఆమె వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూనే సినిమా అవకాశాలు కూడా పట్టేస్తుంది. తాజాగా ఆమె ఫొటో షూట్‌ చేస్తున్న వీడియోని సోషల్‌ మీడియాకి వదిలింది. ఈ వీడియోలో ఆమె అందాన్ని, ఎక్స్‌ప్రెషన్స్‌ని చూసిన వారంతా ఫిదా అవుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. రెడ్‌ శారీలో రెబ్బా రెచ్చగొట్టేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంటే.. ఈ వీడియోలో ఈషా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2020-10-05T02:51:30+05:30 IST

Read more