సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. రియా రూ.15 కోట్లపై..

ABN , First Publish Date - 2020-07-31T00:40:25+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ రోజుకో...

సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. రియా రూ.15 కోట్లపై..

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకూ ముంబై పోలీసుల పరిధిలో మాత్రమే ఈ కేసు విచారణ సాగింది. రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో బీహార్ పోలీసులు కూడా ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పుడు.. తాజాగా ఈడీ కూడా ఈ కేసు విచారణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తి సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు మాయం చేసినట్లు బీహార్ పోలీసులు గుర్తించడంతో ఈడీ ఈ కేసుపై దృష్టి సారించింది. ఆ డబ్బును రియా ఎవరికి బదిలీ చేసింది.. ఎందుకు బదిలీ చేసిందన్న విషయాలపై ఈడీ విచారణ ముందుకు సాగనున్నట్లు తెలిసింది.


సుశాంత్ తన ఆర్థిక వ్యవహారాలను చూసుకునే అవకాశాన్ని కూడా గర్ల్‌ఫ్రెండ్ రియాకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి రియా పాత్రపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే బీహార్ పోలీసులు సుశాంత్ బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ముంబైలోని బాంద్రాలో ఉన్న కొటక్ మహీంద్రా బ్యాంకుకు వెళ్లారు. సుశాంత్ తండ్రి చెబుతున్నట్టు అతని బ్యాంకు ఖాతా నుంచి అజ్ఞాత వ్యక్తుల బ్యాంకు ఖాతాకు రూ.15 కోట్లు బదిలీ కావడంపై ఆరా తీశారు. ఆ డబ్బును రియా ఎవరికి బదిలీ చేసిందనే విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. 

Updated Date - 2020-07-31T00:40:25+05:30 IST