థియేటర్లలో చూడాల్సిన సినిమా: దుల్కర్ సల్మాన్
ABN , First Publish Date - 2020-03-04T23:18:07+05:30 IST
‘‘ఈ సినిమాకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు. ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయకండి’’ అని అన్నారు దుల్కర్ సల్మాన్. ఆయనతో రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది.

‘‘ఈ సినిమాకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు. ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయకండి’’ అని అన్నారు దుల్కర్ సల్మాన్. ఆయనతో రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్ పెరియసామి దర్శకుడు. నిర్మాణ సంస్థలు వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో 'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్' కమలాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డితో కలిసి డా. రవికిరణ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘‘చూసిన వాళ్లందరికీ సినిమా నచ్చింది. ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో చూసే సినిమా కాదు. ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. నేను సినిమాను సింగిల్‌గా చూశా. థియేటర్లలో చూశా. అనీష్ కురువిల్ల చాలా అందమైన విలన్‌గా చేశారు. రీతూ వర్మ అందమైన, టాలెంట్ ఉన్న అమ్మాయి. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. నా క్యారెక్టర్ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఒకేలా ఉంటుంది. కానీ, ఆమె క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. రీతూ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసింది. దర్శకుడు దేసింగ్ పెరియసామి హార్డ్ వర్క్‌కి రిజల్ట్ ఈ సినిమా. మాకు ఈ విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అన్నారు.