గోడమీద పిల్లికి, దేవిశ్రీ ప్రసాద్‌కి లింకేంటి?
ABN , First Publish Date - 2020-12-01T02:56:22+05:30 IST
గోడమీద పిల్లికి, సంగీత సంచలనం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు లింకేంటి అనుకుంటున్నారా? ఉంది.. చాలా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే.. ఆయన సోషల్ మీడియా అకౌంట్‌ని

గోడమీద పిల్లికి, సంగీత సంచలనం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు లింకేంటి అనుకుంటున్నారా? ఉంది.. చాలా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే.. ఆయన సోషల్ మీడియా అకౌంట్‌ని ఒకసారి చెక్ చేయాల్సిందే. విషయంలోకి వస్తే.. నా ఫొటోగ్రఫీ అంటూ దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా తానే తీసిన కొన్ని ఫొటోలను ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన గోడ మీద నిలబడి ఉన్న ఓ పిల్లి ఫొటోని తీసి.. 'గోడ మీద పిల్లి' అని మూడు భాషలలో తెలుపుతూ.. ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజం చెప్పాలంటే.. డిఎస్‌పి ఫొటోగ్రఫీ అదిరింది అని చెప్పాలి. ఎందుకంటే దేవిశ్రీ ఈ ఫొటో కోసం క్రియేటివిటీని ఉపయోగించారు. ఆయన తీసిన ఫొటోలో పిల్లి వెనుక బ్యాక్ గ్రౌండ్‌లో ఆకాశం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఒక వాల్ పేపర్‌లా ఉంది. దీనికి నెటిజన్లు.. సూపర్ అన్నా.. అని, లకీ క్యాట్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Read more