ఎస్‌.పి. బాలు సార్‌ లేకుండా మొదటి రోజు.. : దేవిశ్రీ

ABN , First Publish Date - 2020-09-28T01:02:53+05:30 IST

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలుని సంగీత ప్రపంచం మరిచిపోలేకపోతుంది. ఆయన లేరంటే నమ్మలేకపోతుంది. ఆయన ఎక్కడున్నా.. ఆయన గాత్రం పాట

ఎస్‌.పి. బాలు సార్‌ లేకుండా మొదటి రోజు.. : దేవిశ్రీ

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలుని సంగీత ప్రపంచం మరిచిపోలేకపోతుంది. ఆయన లేరంటే నమ్మలేకపోతుంది. ఆయన ఎక్కడున్నా.. ఆయన గాత్రం పాట రూపంలో ఎప్పటికీ వినబడుతూనే ఉంటుందని కొందరు సముదాయించుకుంటున్నా.. కొందరు మాత్రం ఇంకా ఆ దుఃఖంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. అటువంటి వారిలో దేవిశ్రీ ప్రసాద్‌ ఒకరు. బాలు, దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌లో ఎన్నో అద్బుతమైన పాటలు వచ్చాయి. బాలు లేకుండా నా మ్యూజిక్‌ ప్రస్థానమే లేదంటూ దేవిశ్రీ ఇప్పటికే అనేకసార్లు చెప్పి ఉన్నారు. అలాంటి బాలు లేకుండా అప్పుడే ఒక రోజు గడిచిపోయిందని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.


''ఈరోజు.. ఈ భౌతిక ప్రపంచంలో మా జీవితాలలో బాలు సార్‌ లేకుండా గడిచిన మొదటి రోజు. మేము పుట్టినప్పటి నుంచి ఆయన రోజు మాకు తెలియదు. కానీ ఆయన మాతోనే ఉంటారు. జీవితానికి సరిపడా మ్యూజిక్‌ని ఆయన మ్యాజికల్‌ వాయిస్‌తో మాకు అందించారు. బాలూ సార్‌.. స్వర్గలోకాలను ఎంటర్‌టైన్‌ చేస్తూనే.. మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండండి.." అని ట్వీట్‌లో పేర్కొన్న దేవిశ్రీ.. జీవిత సత్యం గురించి చెబుతున్న బాలు వీడియోని షేర్‌ చేశారు.

Updated Date - 2020-09-28T01:02:53+05:30 IST