రామాయణంలో కేబీసీ ప్రశ్న...లింగా భామను గుర్తుతెచ్చుకున్న ప్రేక్షకులు

ABN , First Publish Date - 2020-04-06T17:51:12+05:30 IST

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దూరదర్శన్‌లో రామాయణం, మహాభారతం సీరియళ్లు ప్రారంభమయ్యాయి. ఇది మొదలు నెటిజనులు...

రామాయణంలో కేబీసీ ప్రశ్న...లింగా భామను గుర్తుతెచ్చుకున్న ప్రేక్షకులు

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దూరదర్శన్‌లో రామాయణం, మహాభారతం సీరియళ్లు  ప్రారంభమయ్యాయి. ఇది మొదలు నెటిజనులు నటి సోనాక్షి సిన్హాను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. దూరదర్శన్ ట్విట్టర్‌లో ప్రేక్షకులను ఒక సాధారణ ప్రశ్న అడిగారు. అయితే దీని మల్టీ ఫుల్ ఛాయస్ ఆన్సర్  చాలా ఫన్నీగా ఉంది. హనుమంతుడు సంజీవని మూలికను ఎవరి కోసం తీసుకువచ్చాడు? అనే ప్రశ్నకు సుగ్రీవుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నడు... అని ఇచ్చారు. గతంలో ఇదే ప్రశ్న కౌన్ బనేగా కరోడ్ పతిలో సోనాక్షిని అడగగా శత్రుఘ్నడు అని చెప్పారు. పైగా అది తన తండ్రి పేరు అని అందుకే గుర్తుందని చెప్పారు. దీనికితోడు లైఫ్ లైన్ ను కూడా వినియోగించుకున్నారు. ఈనేపధ్యంలో ఆమె నెటిజనుల మధ్య నవ్వుల పాలయ్యారు. కాగా నటి సోనాక్షి రజినీకాంత్ సరసన లింగా సినిమాలో నటించారు.

Updated Date - 2020-04-06T17:51:12+05:30 IST