లావైతే దిగులెందుకు?: స‌మీరా రెడ్డి

ABN , First Publish Date - 2020-07-29T20:52:42+05:30 IST

అమ్మాయిలు లావెక్కినా, సన్నగా ఉన్నా దిగులు పడకూడదని, తమను తామే అభిమానించడం నేర్చు కోవాలని ప్రముఖనటి సమీరా రెడ్డి సందేశమిస్తోంది.

లావైతే దిగులెందుకు?: స‌మీరా రెడ్డి

అమ్మాయిలు లావెక్కినా, సన్నగా ఉన్నా దిగులు పడకూడదని, తమను తామే అభిమానించడం నేర్చు కోవాలని ప్రముఖనటి సమీరా రెడ్డి సందేశమిస్తోంది. అమ్మాయిలు ఎప్పుడూ తమను ఇతరులతో పోల్చుకుని చూడటం తగదని, ఇటీవల ఓ బాలింత బరువు పెరిగానని, లావెక్కిన ఒళ్ళు చూసి అసహ్యించుకుంటున్నానని ఓ ఎస్‌ఎంఎస్‌ పంపిందని, అది చూసి వేదన చెందానని సమీరారెడ్డి తెలిపింది. సన్నగా, నాజూకుగా లేదని బాధపడటం మానుకోవాలని, ఇతరులను చూసి తాను అందంగా లేదని దిగులు చెందకూడదంటోంది. సినీ రంగంలోనూ హీరోయిన్లు కూడా తోటి హీరోయిన్లతో తమను పోల్చుకుని సన్నబడేందుకు లేదా లావెక్కేందుకు ప్రయత్నిస్తుంటారిని తెలిపింది. మనమెలా ఉన్నామన్నది ముఖ్యం కాదు సంతోషంగా ఉన్నామా లేదా అదే ముఖ్యమని, లావెక్కితే దిగులు పడాల్సిన అవసరం లేదని, తరచూ వ్యాయామం చేస్తూ బరువును తగ్గించుకోవచ్చునని, సన్నగా, లావుగా ఉన్నామని బాధపడటం కన్నా ఉన్న సదుపాయాలతో సంతోషంగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన జరుపుకోవాలని సమీరారెడ్డి హితవు పలికింది.

Updated Date - 2020-07-29T20:52:42+05:30 IST