టాలీవుడ్ నుంచి విరాళాల వెల్లువ
ABN , First Publish Date - 2020-10-23T06:52:29+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన హైదరాబాద్‌ను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది...

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన హైదరాబాద్‌ను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది. ఈ మేరకు నాలుగు రోజుల నుంచి సినీరంగ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం హీరో రామ్ రూ.25 లక్షలు, దర్శకుడు ఎన్.శంకర్ రూ.10 లక్షలను రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కుల ద్వారా అందజేశారు.