వెబ్‌ సిరీస్‌లో అలా చేయడం సవాలే

ABN , First Publish Date - 2020-10-12T07:17:12+05:30 IST

‘‘సినిమా అయితే రెండున్నర గంటల్లో కథ చెప్పాలి. వెబ్‌ సిరీస్‌లో టైమ్‌ లిమిట్‌ ఉండదు. స్వేచ్ఛ ఉంటుంది. ఎంతైనా చెప్పవచ్చు. అయితే, ప్రతి ఎపిసోడ్‌ చివర్లో తర్వాత ఏం...

వెబ్‌ సిరీస్‌లో అలా చేయడం సవాలే

‘‘సినిమా అయితే రెండున్నర గంటల్లో కథ చెప్పాలి. వెబ్‌ సిరీస్‌లో టైమ్‌ లిమిట్‌ ఉండదు. స్వేచ్ఛ ఉంటుంది. ఎంతైనా చెప్పవచ్చు. అయితే, ప్రతి ఎపిసోడ్‌ చివర్లో తర్వాత ఏం జరుగుతుందోనని వీక్షకుల్లో ఆసక్తి కలిగించేలా ముగింపు ఇవ్వాలి. అది సవాలే. ప్రస్తుతం ఓటీటీకి చక్కటి ఆదరణ లభిస్తోంది’’ అని శంకర్‌ కె. మార్తాండ్‌ అన్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఆయన దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘ఎక్స్‌పైరీ డేట్‌’. శరత్‌ మరార్‌ నిర్మాత. టోనీ లూక్‌, స్నేహా ఉల్లాల్‌, మధు శాలిని, అలీ రేజా ప్రధాన తారలు. ‘జీ 5’ ఓటీటీలో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కి లభిస్తోన్న స్పందన పట్ల దర్శకుడు శంకర్‌ కె. మార్తాండ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘స్వతహాగా థ్రిల్లర్స్‌ అంటే నాకిష్టం. శరత్‌ మరార్‌ వెబ్‌ సిరీస్‌ చేయాలనుకుంటున్నారని తెలిసి కథ చెప్పా. ఆయనతో పాటు ‘జీ 5’ వాళ్లకూ నచ్చింది. హిందీలోనూ వెబ్‌ సిరీస్‌ తీద్దామని వాళ్లే చెప్పారు. ప్రసాద్‌ నిమ్మకాయల మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఇందులో 30 నిమిషాల నిడివి కల పది ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌, ట్విస్ట్‌లు బావున్నాయని వీక్షకులు చెబుతున్నారు. ఈ విజయంతో నా బ్యాడ్‌ టైమ్‌ ముగిసింది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌, సినిమా అవకాశాలు వస్తున్నాయి’’ అని అన్నారు. 

Updated Date - 2020-10-12T07:17:12+05:30 IST