వెలుగుల పండగ వేళ...

ABN , First Publish Date - 2020-11-14T05:26:43+05:30 IST

ఓ పక్క కరోనా భయం... మరో పక్క ఏడాదికి ఒక్కసారే వచ్చే దీపాల పండగ... జరుపుకోవాలా వద్దా అనే సంశయం. అందుకే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ సంప్రదాయ.....

వెలుగుల పండగ వేళ...

ఓ పక్క కరోనా భయం... మరో పక్క ఏడాదికి ఒక్కసారే వచ్చే దీపాల పండగ... జరుపుకోవాలా వద్దా అనే సంశయం. అందుకే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ సంప్రదాయ పండగను సెలబ్రేట్‌ చేసుకోవాలని తారలు పిలుపునిచ్చారు.


పెళ్లైన తర్వాత...

‘‘ఈ ఏడాది దీపావళి నాకెంతో ప్రత్యేకం! గౌతమ్‌ కిచ్లూతో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన కొన్ని రోజులకు వచ్చిన పండగ కాబట్టి చాలా స్పెషల్‌ అని చెప్పాలి. మా ఇద్దరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ మధుర జ్ఞాపకంలా దీపావళిని సెలబ్రేట్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేశాం. సాధారణంగా దీపాల పండగ అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే... కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే క్షణాలు. ఇప్పుడు నా కుటుంబం మరింత పెద్దది అయింది కనుక ఈ ఏడాది పండగ మరింత ఎక్కువ సంతోషం, ప్రత్యేకం అన్నమాట. సంప్రదాయం ప్రకారం నిర్వహించే పూజ తప్పకుండా నిర్వహిస్తాం’’

- కాజల్‌ అగర్వాల్‌అప్పుడే అసలైన దీపావళి!

‘‘దీపావళి కోసం ప్రత్యేకంగా ప్లాన్‌ చేయలేదు. గురువారం వరకూ హైదరాబాద్‌లో ఓ సినిమా చిత్రీకరణ చేశా. పండగ అని రెండు రోజులు విరామం తీసుకున్నాను. కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్లాన్‌ చేస్తున్నారు. వాళ్ళతో జాయినవుతా. పండక్కి హైదారాబాద్‌లోనే ఉంటా. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి (కరోనా వైరస్‌) అంతమైనప్పుడే అసలైన దీపావళి అని నా అభిప్రాయం. అయితే... నేను ఆశావాహ దృక్పథంతో ఉండే మనిషిని. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నా. ప్రతి ఏడాదీ దీపావళికి కొత్త దుస్తులు, నగలు కొనుక్కోవడం నాకు అలవాటు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బయటకు వెళ్లడం కంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. అందుకని, మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పండగ జరుపుకోండి.’’

- రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
చెన్నైలో... సెట్‌లో!

‘‘దీపావళి అంటే నాకు గుర్తొచ్చేది కుటుంబమే. ఇంట్లో లక్ష్మి, గణపతి పూజలు నిర్వహించడం, అమ్మ చేతి పాయసం (ఖీర్‌), కజిన్స్‌తో ఆటలు, వగైరా వగైరా... కొన్నేళ్ల నుంచి నేను చేస్తున్నదిదే! కానీ, ఈ ఏడాది చెన్నైలో సెట్‌లో యూనిట్‌ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నా. పూజ చేసి, ఆ తర్వాత దీపాలు వెలిగిస్తా. చెన్నైలో చిత్రీకరణకు స్వల్ప విరామం ప్రకటించి ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నా తల్లితండ్రుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రిస్క్‌ ఎందుకని ప్రయాణాన్ని విరమించుకున్నా. అయితే... దీపావళికి అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి మాట్లాడతా. ఈ ఏడాది దీపావళికి కుటుంబాన్ని మిస్‌ అవుతున్నా. పటాసుల విషయానికి వస్తే... చిన్నతనంలో కాల్చేదాన్ని. అయితే, పర్యావరణానికి అవి చేసే హాని తెలుసుకున్న తర్వాత మానేశా. సంప్రదాయం కోసం ఒకట్రెండు చిన్నవి అంటిస్తున్నా’’

- రాశీ ఖన్నా
జ్ఞానం అనే వెలుగును ప్రసాదించాలి

‘‘నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పనివారు ఉండేవారు కాదు. అందుకే మా పనులు మేమే చేసుకునేవాళ్లం. దీపావళికి వారం ముందే ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టేవాళ్లం. ఈ రోజు ఒక గది శుభ్రం చేస్తే.. రేపు మరో గది శుభ్రం చేయాలని ప్లాన్‌ చేసుకునేవాళ్లం. క్లీనింగ్‌ పూర్తయ్యాక ఇల్లంతా అందంగా అలకరించుకుంటాం. రంగోలీ వేయడం నాకు బాగా అలవాటు. ఒకరోజు ముగ్గులు వేసి రకరకాల రంగులు అద్దేదాన్ని. ఆ విషయంలో నాకూ, చెల్లి షాగున్‌కి పెద్ద పోటీ ఉండేది. దీపావళి రోజున కుటుంబ సభ్యులు అందరి మధ్య గడపడం నాకెంతో ఇష్టం. ప్రతి ఏటా దీపావళికి డబ్బాకు తక్కువ కాకుండా స్వీట్స్‌ తింటా. తిన్నాక కుటుంబ సభ్యుల మధ్య గిల్టీగా ఫీలయ్యేదాన్ని. ఈ ఏడాది స్వీట్లకు దూరంగా ఉండాలనుకుంటున్నా. ఎంతవరకూ ఉండగలనో చూస్తా. చిన్నప్పుడు క్రాకర్స్‌ బాగా కాల్చేదాన్ని. స్కూలింగ్‌ అయ్యాక క్రాకర్స్‌ కాల్చడం వల్ల పర్యావరణాన్ని చేతులారా కాలుష్యం చేస్తున్నామనే భావనతో మానేశా. ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడే ప్రతి ఒక్కరిలో ఈ దీపావళి జ్ఞానం అనే కాంతిని నింపాలని, ఆలోచనా విధానం మారాలని కోరుకుంటున్నా’’

- తాప్సీ 


రెండ్రోజుల ముందే ఇంట్లో ఉంటా

‘‘పండగ అనేది కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి ఓ చోట జరుపుకొనే వేడుక. అందులో నాకు దీపావళి చాలా ఇష్టమైన పండగ. ఇప్పుడైతే వృత్తిరీత్యా బిజీగా ఉన్నా పండగకు రెండ్రోజుల ముందే ఇంటికి చేరిపోతా. చిన్నతనంలో క్రాకర్స్‌ కోసం ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అమ్మానాన్నని డిమాండ్‌ చేసేదాన్ని. కానీ ఇప్పుడలా లేదు. పర్యావరణం దృష్ట్యా టపాసులు కాల్చడానికి అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు నేను క్రాకర్స్‌ కాల్చడానికి పూర్తి వ్యతిరేకిని. ఇక నాకు స్వీట్స్‌ అంటే చాలా ఇష్టం’’.

- పాయల్‌ రాజ్‌పుత్‌

Updated Date - 2020-11-14T05:26:43+05:30 IST