మహేష్‌ బాబు నుంచి గిఫ్ట్‌లొస్తున్నాయ్‌

ABN , First Publish Date - 2020-11-14T04:03:01+05:30 IST

ప్రతీ సంవత్సరం దీపావళి సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైన గిఫ్టులు అందిస్తుంటారు మహేశ్-నమ్రత జంట. ఈ ఏడాది వీరు దుబాయ్

మహేష్‌ బాబు నుంచి గిఫ్ట్‌లొస్తున్నాయ్‌

ప్రతీ సంవత్సరం దీపావళి సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైన గిఫ్టులు అందిస్తుంటారు మహేశ్-నమ్రత జంట. ఈ ఏడాది వీరు దుబాయ్ లో హాలీడేలో ఉన్నారు. అయినా.. తమ శ్రేయోభిలాషుల కోసం గిఫ్ట్ బాక్సులు పంపించారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మహేశ్, నమ్రత, గౌతమ్, సితార అంటూ ఉన్న గ్రీటింగ్ కార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుంచి గిప్ట్ అందుకున్న సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తూ.. వారు అందుకున్న గిఫ్ట్‌ను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు. 


మహేష్‌ నుంచి ఈ సంవత్సరం ఇప్పటి వరకు అడవిశేష్, గుణశేఖర్‌లకు గిఫ్ట్ బాక్స్‌లు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వారు తమ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని షేర్‌ చేశారు. దీపావళి ఇంటికి ఎర్లీగా వచ్చిందంటూ తన చిత్ర నిర్మాతలైన మహేశ్, నమ్రతకు థ్యాంక్స్ చెబుతూ అడవి శేష్‌ ట్వీట్ చేయగా.. మహేష్‌ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలుపుతూ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు గుణశేఖర్‌. 

Updated Date - 2020-11-14T04:03:01+05:30 IST