విశాల్‌ కూడా షురూ చేస్తున్నాడు

ABN , First Publish Date - 2020-10-27T20:49:19+05:30 IST

హీరో, నిర్మాణంతో పాటు విశాల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'డిటెక్టివ్‌ 2'. మిస్కిన్‌ దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ చిత్రం విశాల్‌కు, మిస్కిన్‌కు మధ్య గొడవ రావడంతో మిస్కిన్‌ సినిమా నుండి తప్పుకున్నాడు. దాంతో...

విశాల్‌ కూడా షురూ చేస్తున్నాడు

హీరో, నిర్మాణంతో పాటు విశాల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'డిటెక్టివ్‌ 2'. మిస్కిన్‌ దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ చిత్రం విశాల్‌కు, మిస్కిన్‌కు మధ్య గొడవ రావడంతో మిస్కిన్‌ సినిమా నుండి తప్పుకున్నాడు. దాంతో విశాల్‌ దర్శకుడిగా మారాడు. 2017లో విశాల్‌ హీరో, నిర్మాతగా రూపొందిన 'డిటెక్టివ్‌' చిత్రానికి ఇది సీక్వెల్‌. యూరప్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలో యూరప్‌లో చిత్రీకరించాల్సిన భాగాన్ని చిత్రీకరించేశారు. తదుపరి షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకున్న నేపథ్యంలో కోవిడ్‌ ప్రభావం కారణంగా ఈ సినిమా ఆగింది. మరోవైపు ఈ గ్యాప్‌లో విశాల్‌ తన చక్ర సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ను పూర్తి చేసే పనుల్లో బిజీ అయ్యాడు. కాగా.. లేటెస్ట్‌గా విశాల్‌ రూపొందిస్తోన్న 'డిటెక్టివ్‌ 2' చిత్రం కొత్త షెడ్యూల్‌ను నవంబర్‌ 9 నుండి స్టార్ట్‌ చేయబోతున్నాడు. ఈసారి డిటెక్టివ్‌ అద్వైత భూషణ్‌ ఏ సీక్రెట్‌ను చేధిస్తాడో చూడాలి మరి. 


Updated Date - 2020-10-27T20:49:19+05:30 IST