జావేద్‌ అక్తర్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

ABN , First Publish Date - 2020-06-08T04:22:57+05:30 IST

ప్రముఖ హిందీ గేయ, కథా రచయిత జావేద్‌ ఆక్తర్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్ఠాత్మక రిచర్డ్‌ డాకిన్స్‌ (ప్రముఖ జీవశాస్త్రవేత్త పేరు మీద ఇచ్చే) పురస్కారం ఆయన్ను వరించింది...

జావేద్‌ అక్తర్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

ప్రముఖ హిందీ గేయ, కథా రచయిత జావేద్‌ ఆక్తర్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్ఠాత్మక రిచర్డ్‌ డాకిన్స్‌ (ప్రముఖ జీవశాస్త్రవేత్త పేరు మీద ఇచ్చే) పురస్కారం ఆయన్ను వరించింది. విద్య, వినోదం, శాస్త్రీయ రంగాల్లో లౌకికవాదం, హేతువాదం, శాస్త్రీయ సత్యాలను సమర్ధించే వ్యక్తులను ఈ పురస్కారంతో సత్కరిస్తారు. మతపరమైన సిద్ధాంతాలపై పరిశీలనాత్మక పరిశోధన, విమర్శనాత్మక ఆలోచనలు, మనవతా విలువల అభివృద్ధి, మానవ పురోగతిపై కృషి చేసినందుకు జావేద్‌ అక్తర్‌కు పురస్కారం ప్రకటించినట్టు ఆయన సతీమణి షబానా అజ్మీ తెలిపారు. లౌకికవాదంపై మతపరమైన శక్తులు దాడి చేస్తున్న తరుణంలో హేతువాదానికి జావేద్‌ చిరకాలంగా చేస్తున్న సేవలకు ఈ పురస్కారం విలువ తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ పురస్కారం అందుకుంటున్న తొలి భారతీయుడు జావేద్‌ అక్తర్‌ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాభినందనలు తెలిపారు.

Updated Date - 2020-06-08T04:22:57+05:30 IST