14వ అంతస్థు నుంచి దూకి ఐశ్వర్యారాయ్ మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-10T00:14:50+05:30 IST

ముంబై: ఐశ్వర్యారాయ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకున్నారు.

14వ అంతస్థు నుంచి దూకి ఐశ్వర్యారాయ్ మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య

ముంబై: ఐశ్వర్యారాయ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై మలాద్ ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్ 14వ అంతస్థు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. కిందకు దూకిన సమయంలో ఇంట్లోనే ఉన్న దిశా భర్త ఆమెను బొరివలి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


గతంలో ఆమె నటులు వరుణ్ శర్మ, సుశాంత్ సింగ్‌ వద్ద కూడా పనిచేశారు. 

Updated Date - 2020-06-10T00:14:50+05:30 IST