దర్శకుడు విఐ ఆనంద్ భార్య రాసిన బుక్ విడుదల

ABN , First Publish Date - 2020-06-08T23:00:27+05:30 IST

‘టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న డైరెక్టర్ విఐ ఆనంద్, ప్రస్తుతం తన

దర్శకుడు విఐ ఆనంద్ భార్య రాసిన బుక్ విడుదల

‘టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న డైరెక్టర్ విఐ ఆనంద్, ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులో బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన సతీమణి అనూష వేలుస్వామి తొలిసారిగా రచించిన ఓ ఇంగ్లీష్ పోయెట్రీ పుస్తకం విడుదల అయినట్లుగా ఆనంద్ ప్రకటించారు. ‘వాట్ ఈఫ్ రైన్ బౌస్ వర్ యువర్ షాడోస్’ అనే టైటిల్‌తో ఈ పుస్తకం పబ్లిష్ అయినట్లుగా ఆనంద్ తెలిపారు. 


ప్రేమ, ప్రాణులు, జీవం, జీవితం, వస్తువులు ఇలా పలు రకాలు అంశాలు ప్రేరణగా తీసుకొని వాటి మీద రాసిన అనేకనేక ఇంగ్లీష్ పోయెమ్స్ సమాహారం ఈ పుస్తకం అని ఆనంద్ తెలిపారు. నోషన్ ప్రెస్ డాట్ కామ్ వారు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. వారి వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో ఈ పుస్తకం లభ్యం అవుతుంది అని విఐ ఆనంద్ తెలిపారు.Updated Date - 2020-06-08T23:00:27+05:30 IST