సోనూసూద్ బాటలో సుకుమార్

ABN , First Publish Date - 2020-08-04T01:19:30+05:30 IST

ఈ కరోనా సమయంలో మానవత్వం ఉన్న మనిషిగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు ఇప్పుడు ప్రతిచోటా

సోనూసూద్ బాటలో సుకుమార్

ఈ కరోనా సమయంలో మానవత్వం ఉన్న మనిషిగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు ఇప్పుడు ప్రతిచోటా మారుమోగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడందరూ సోనూసూద్‌ని రియల్ హీరోగా చూస్తున్నారు. ఇప్పుడాయన ఎందరికో స్ఫూర్తి నింపుతున్నారు. ముగ్గురు అనాథల కథనం సోనూసూద్ వరకు వెళ్లడం, ఆయన వారి బాధ్యత తీసుకుంటానని చెప్పడం తెలిసిన విషయాలే. అయితే నిర్మాత దిల్ రాజు ఆ ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ కూడా సోనూసూద్ బాట పట్టారు. 


సుకుమార్ తన సొంత ఊరిలో ఓ స్కూల్‌ భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈస్ట్ గోదావ‌రి జిల్లా రాజోలు సమీపంలోని మ‌ట్టుప‌ర్రు గ్రామం సుకుమార్ సొంత ఊరు. ఆ ఊరిలో తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి నాయుడు పేరు మీద మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో రెండు అంతస్థులను తన సొంత ఖర్చులతో నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 1న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సుమారు రూ. 14 లక్షల వరకు ఆయన ఖర్చు చేయబోతోన్నట్లుగా సమాచారం.

Updated Date - 2020-08-04T01:19:30+05:30 IST