డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే..

ABN , First Publish Date - 2020-06-08T04:08:57+05:30 IST

‘సాహో’ డైరెక్టర్ సుజీత్ పెళ్లి ఫిక్స్ అయినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘రన్ రాజా రన్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుజీత్ తొలిచిత్రంతోనే

డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే..

‘సాహో’ డైరెక్టర్ సుజీత్ పెళ్లి ఫిక్స్ అయినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘రన్ రాజా రన్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుజీత్ తొలిచిత్రంతోనే సక్సెస్‌ను అందుకోవడమే కాకుండా రెండో సినిమాకే ఇండియన్ స్టార్ ప్రభాస్‌ డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌తో ‘సాహో’ సినిమాను తెరకెక్కించి యాక్షన్ డైరెక్టర్‌గా మారారు. ఇప్పటి వరకు బ్యాచ్‌లర్‌గా ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. 


వివరాల్లోకి వెళితే.. ఈనెల (జూన్) 10న ప్రవళ్లిక అనే డెంటిస్ట్ కం స్క్రీన్‌ప్లే రచయితతో సుజీత్ నిశ్చితార్థం జరగనుంది. హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఉదయం 9 గంటలకు నిశ్చితార్థం జరగునున్నట్లుగా తాజా సమాచారం. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధుమిత్రులు, మొత్తంగా 50 మంది మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేసేందుకు సుజీత్ రెడీ అవుతున్నారు.

Updated Date - 2020-06-08T04:08:57+05:30 IST