ఇండియ‌న్ 2 సెట్స్‌లో జరిగిన ప్ర‌మాదంపై శంక‌ర్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

ABN , First Publish Date - 2020-02-27T00:48:06+05:30 IST

ఇండియన్2 ప్ర‌మాదంపై సీబీ సీఐడీ పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో శంక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేస్తూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.

ఇండియ‌న్ 2 సెట్స్‌లో జరిగిన ప్ర‌మాదంపై శంక‌ర్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

కమల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇండియ‌న్ 2’. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా సెట్స్‌పై క్రేన్ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు చ‌నిపోయారు..ప‌ది మంది గాయ‌ప‌డ్డారు. చిత్ర బృందం ఉండే  టెంట్‌పై క్రేన్ ప‌డ‌టం వ‌ల్ల శంక‌ర్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు మ‌ధు, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ సాయికృష్ణ‌, ఆర్ట్ అసిస్టెంట్ చంద్ర‌న్ మృతి చెందారు. ఈ ప్ర‌మాదంపై సీబీ సీఐడీ పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో శంక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేస్తూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. 


‘‘నేనింకా షాక్‌లోనే ఉన్నాను. ఎంతో దుఃఖంతో ట్వీట్ చేస్తున్నాను. ప్ర‌మాదంలో స‌హాయ‌క సిబ్బందిని కోల్పోవ‌డం నాకెంతో బాధ‌గా ఉంది. ప్ర‌మాదం జరిగిన త‌ర్వాత నేను నిద్ర‌లేని రాత్రుల‌ను గ‌డిపాను. త్రుటిలో క్రేన్ ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్నాను. క్రేన్ నాపై ప‌డి ఉన్నా బావుండుననిపించింది. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను’’ అని త‌న బాధ‌ను వ్యక్తం చేశారు డైరెక్ట‌ర్ శంక‌ర్‌. 


Updated Date - 2020-02-27T00:48:06+05:30 IST