‘కార్తికేయ 2’ హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ABN , First Publish Date - 2020-06-08T01:38:59+05:30 IST

హీరో నిఖిల్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒక‌టి. చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చిత్ర‌మిది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగ‌తి

‘కార్తికేయ 2’ హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

హీరో నిఖిల్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒక‌టి. చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చిత్ర‌మిది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే రీసెంట్‌గా హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమా నుండి త‌ప్పుకుంద‌ని, త‌న పాత్ర‌కు అంత ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో అనుప‌మ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయింద‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్పుడు మ‌రో హీరోయిన్‌ని తీసుకునే ఆలోచనలో ఉన్నారనే గట్టిగానే వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ దర్శకుడు చందు మొండేటి క్లారిటీ ఇచ్చారు. 


‘‘మా సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. తప్పకుండా ఆమె సినిమా చేస్తుంది. వినిపిస్తున్న వార్తలో ఎటువంటి నిజం లేదు..’’ అని దర్శకుడు చందు మొండేటి తెలపడంతో ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లు అయింది. దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఈ సినిమాలో ఖచ్చితంగా అనుపమ పరమేశ్వరనే హీరోయిన్ అని తెలుస్తుంది.

Updated Date - 2020-06-08T01:38:59+05:30 IST