నేను వేరే వ్య‌క్తిలా న‌టిస్తున్నానంటా: ‘రాధేశ్యామ్’ దర్శకుడు

ABN , First Publish Date - 2020-07-12T00:30:02+05:30 IST

ఇప్పటి వరకు ఈ దర్శకుడు తీసింది ఒక్కటంటే ఒక్కటే సినిమా. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘జిల్’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు దర్శకుడు

నేను వేరే వ్య‌క్తిలా న‌టిస్తున్నానంటా: ‘రాధేశ్యామ్’ దర్శకుడు

ఇప్పటి వరకు ఈ దర్శకుడు తీసింది ఒక్కటంటే ఒక్కటే సినిమా. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘జిల్’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో, ఆ చిత్రం తీసిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు, మరో చిత్రం అవకాశం ఇవ్వడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ‘జిల్’ చిత్రం విడుదలై చాలాకాలం అవుతుంది. అప్పటి నుంచి ప్రభాస్ కోసం వేచి చూస్తున్న రాధాకృష్ణ కుమార్‌కు ప్రభాస్ నుంచి ఇప్పటికి మోక్షం లభించింది. ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డేలతో ఆయన చిత్రం సెట్స్‌పై ఉంది. ఇంకా 30 శాతం షూటింగ్ జరపాల్సి ఉంది. కరోనా కారణంగా ఆగిపోయింది కానీ లేదంటే ఇప్పటికే టాకీ పార్ట్ కూడా పూర్తయ్యేది. తాజాగా ఈ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ పెట్టి.. ఫస్ట్ లుక్ కూడా వదిలారు. 


అయితే ప్రభాస్ సినిమా సెట్స్‌పైకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ కుమార్ ఎవరో కొంతమందికి తెలిసింది కానీ అంతకు ముందు ఆయన ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా అయిన ఇన్‌స్టాగ్రమ్‌కు కూడా ఆ విషయం తెలియనట్లుంది. తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ బ్లాక్ అయిందని, అదేమని అడిగితే.. మీరు వేరే వ్యక్తిగా నటిస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రమ్ నుంచి తనకి మెసేజ్ వచ్చిందని తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతే కాదు తనలా ఉన్న ఆ వ్యక్తి ఎవరో మరి? అంటూ కూడా ఆయన పోస్ట్ చేశాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రంతో తనెంటో నిరూపించుకోవాల్సి ఉందనేది మాత్రం ఈ ట్వీట్‌తో తను తెలిపినట్లుగా అర్థమవుతుంది.Updated Date - 2020-07-12T00:30:02+05:30 IST