రియల్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ అలా చేయరు: పూరి

ABN , First Publish Date - 2020-10-23T04:13:55+05:30 IST

నిన్ను తిట్టేవాడు నీకు ఫ్రెండ్‌గా కావాలి. నువ్వు వెళ్లు మావా.. నేను చూసుకుంటాగా అనేవాడు మనతో ఉండాలి. ఫ్రెండ్స్‌కి నువ్వెప్పుడు బర్డెన్‌ అవ్వకూడదు. ఎవరైనా మనసు విప్పి విషయాలు

రియల్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ అలా చేయరు: పూరి

నిన్ను తిట్టేవాడు నీకు ఫ్రెండ్‌గా కావాలి. నువ్వు వెళ్లు మావా.. నేను చూసుకుంటాగా అనేవాడు మనతో ఉండాలి. ఫ్రెండ్స్‌కి నువ్వెప్పుడు బర్డెన్‌ అవ్వకూడదు. ఎవరైనా మనసు విప్పి విషయాలు చెప్పుకునేది ఫ్రెండ్స్‌తోనే. అందుకే స్నేహానికి విలువ ఇవ్వండి..అన్నారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన 'ఫ్రెండ్స్‌' అనే టాపిక్‌ మీద మాట్లాడారు. స్నేహం గురించి ఆయన ఇంకేం చెప్పారో.. తెలుసుకుందామా..


''లైఫ్‌లో ఫ్రెండ్స్‌ చాలా ఇంపార్టెంట్‌. పాజిటివ్‌ యాటిట్యూడ్‌ ఉండేవారితో స్నేహం చేయండి. నెగిటివ్‌ యాటిట్యూడ్‌ ఉన్నవారిని దూరం పెట్టండి. అలాంటి వాళ్లు మనకొద్దు. కూర్చుంటే తాగే ఫ్రెండ్స్ కావాలి కానీ.. తాగడం కోసమే కూర్చునే ఫ్రెండ్స్‌ మనకొద్దు. నీ ఫ్రెండ్స్‌ ఎంత మంది అని అడిగితే.. నీ ఆన్సర్‌ 10 లోపే ఉండాలి. 30, 40 పేర్లు చెప్పావంటే.. నువ్వు బుర్ర తక్కువ వెధవవి అని అర్థం. ఎవడు ఫ్రెండో.. ఎవడు కాదో కూడా తెలియదు. అలాగే కొంతమంది ఓల్డర్‌ పీపుల్‌తో స్నేహం చేయండి. 50 ఏళ్లు పైబడిన చెట్లకి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ల అనుభవం తెలుసుకోవడం చాలా అవసరం. అన్నీ అనుభవించక్కరలేదు. వాళ్ల అనుభవాల్ని.. మన అనుభవాలుగా మారిస్తే చాలు. ఎవడైనా ఫ్రెండ్‌ నిన్ను మోసం చేస్తే గుర్తు పెట్టుకో. వాడు నీ ఫ్రెండ్‌ కాదు.. ఇన్నాళ్లు నీ ఫ్రెండ్‌లా యాక్ట్ చేశాడు. రియల్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ అలా చేయరు. ఒక్కోసారి నిజమైన ఫ్రెండ్స్‌ బోరింగ్‌గా ఉండొచ్చు.. బ్యాడ్‌ ఫ్రెండ్స్‌ మాత్రం బాగా ఎంటర్‌టైన్‌ చేస్తారని గుర్తుపెట్టుకోండి. నిన్ను తిట్టేవాడు నీకు ఫ్రెండ్‌గా కావాలి. నువ్వు వెళ్లు మావా.. నేను చూసుకుంటాగా అనేవాడు మనతో ఉండాలి. ఫ్రెండ్స్‌కి నువ్వెప్పుడు బర్డెన్‌ అవ్వకూడదు. ఎవరైనా మనసు విప్పి విషయాలు చెప్పుకునేది ఫ్రెండ్స్‌తోనే. అందుకే స్నేహానికి విలువ ఇవ్వండి.." అని పూరి ఫ్రెండ్స్‌ గురించి చెప్పుకొచ్చారు.   

Updated Date - 2020-10-23T04:13:55+05:30 IST

Read more