భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివే

ABN , First Publish Date - 2020-09-16T03:15:34+05:30 IST

మనిషి పుట్టాక చావడం అనేది కంపల్సరీగా జరిగేదే. అలాంటప్పుడు మనిషికి భయం ఎందుకు? చావుని రోజూ ఎన్నో సార్లు టచ్ చేస్తున్నాం. చావు అనే

భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివే

మనిషి పుట్టాక చావడం అనేది కంపల్సరీగా జరిగేదే. అలాంటప్పుడు మనిషికి భయం ఎందుకు? చావుని రోజూ ఎన్నో సార్లు టచ్ చేస్తున్నాం. చావు అనే భయాన్నే జయిస్తున్నపుడు.. ఇంకా వేరే భయాలు ఎందుకు? అని అన్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్‌. పూరి మ్యూజింగ్స్‌లో ఆయన 'ఫియర్‌' అనే టాపిక్‌ గురించి మాట్లాడారు. భయాన్ని ఓవర్ టేక్ చేయాలంటే ఏం చేయాలో తెలుపుతూ.. ఏదో ఒక రోజు చనిపోయేటప్పుడు.. రోజూ భయపడి చావడం ఎందుకు? అని.. మనుషుల్లో ఉన్న భయం పోగొట్టేలా కొన్ని సూచనలు చేశారు.


ఆయన మాట్లాడుతూ.. "పుట్టినప్పుడు మనం అమాయకంగానే పుట్టాం. మనకు భయం అంటే ఏమిటో తెలియదు. కానీ తర్వాత ఈ సొసైటీ మనలో వంద భయాలు క్రియేట్‌ చేసింది. ప్రతి మతం మనల్ని భయంతోనే పెంచింది. ధైర్యం నూరి పోసిన మతం ఒక్కటీ లేదు. దేవుడ్ని చూసి భయపడటం నేర్పారు తప్ప.. ప్రేమించడం నేర్పలా. దేవుడి దగ్గర అడుక్కోవడం నేర్పారు. కాళ్ల మీద పడటం నేర్పారు. లెంపలేసుకోవడం నేర్పారు. రకరకాల భయాలు బుర్రనిండా పెట్టారు. ఫైవియర్‌ వస్తుందేమో అని భయం. ప్రేమించరేమో అని భయం. దెయ్యం వస్తుందేమో అనే భయం. ఉన్నది పోతుందేమో అనే భయం. పుట్టగానే గట్టిగా ఏడుస్తాం. ఆ మొదటి ఏడుపుతోనే ఊపిరి తీసుకోవడం స్టార్టవుతుంది. ఒకరోజు ఆ ఊపిరి వదిలేస్తాం.. పోతాం. అంటే బ్రీతింగ్‌ ఈజ్ లైఫ్‌. బ్రీత్ అవుట్‌ ఈజ్ డెత్‌. ఊపిరి పీల్చుకున్న ప్రతిసారీ మనం బతికి చావు అంచు దాకా తిరిగొస్తున్నాం. ప్రతి బ్రీత్‌ అవుట్‌కి మనం చావుని ముద్దు పెట్టుకుని వస్తున్నాం. చాలా కామెడీగా.  మనకున్న భయాల్లో అన్నీటి కంటే పెద్దది చావు భయం. దానినే రోజుకు కొన్ని వేల సార్లు ఖో ఖో గేమ్‌లాగా వెళ్లి టచ్ చేసి వస్తున్నాం. దానితో పోలిస్తే.. మిగతా భయాలు మనకోలెక్కా? 


భయాలు అందరిలో ఉంటాయ్‌. భయంతో అక్కడే ఆగిపోతే పిరికితనం. అదే భయంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే ధైర్యం. అంతే తేడా. భయం వల్ల కోపం వస్తది. కోపం వల్ల వయలెంట్‌ అవుతాం. కాబట్టి ఫియర్‌ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయవద్దు. మనలో ఉన్న భయాల్ని ఓవర్ టేక్ చేయాలంటే రెండే రెండు సూత్రాలు. 1. సెన్సాఫ్‌ హ్యుమర్. సెన్సాఫ్‌ హ్యుమర్ డెవలప్ చేసుకోండి. మన ప్రతి భయాన్ని కామెడీ యాంగిల్‌లో చూడండి. మీ భయం మీద మీరే జోకులేసుకోండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ.. తిట్టుకుంటూ నవ్వుకోండి. అన్ని పోయి రోడ్డుమీదకు వస్తే.. ఏంట్రా బాలరాజు ఇలా అయిపోయావ్‌. ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం..? అని మిమ్మల్ని మీరే నవ్వుతూ అడగండి. మన ఈగో పక్కన పెడితే.. ఏ ఫెయిల్యూరూ మనల్ని డ్యామేజ్ చేయలేదు. 2. ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయండి.  మీ మజిల్స్ విజిల్స్ వేస్తే.. మీ నరాలు ధైర్యంతో నిండిపోతాయ్‌. ఏ భయాలు మిమ్మల్ని ఏం చేయలేవ్‌. రోజుకి 100 సార్లు చావు అనే చెంపమీద చిటికెస్తున్నాం మనకి భయమేంటన్నా? ఒకరోజు ఎలాగూ చస్తాం. భయంతో రోజూ చావడం ఎందుకురా గూట్లే..?" అని పూరి ఈ ఆడియోలో చెప్పుకొచ్చారు.



Updated Date - 2020-09-16T03:15:34+05:30 IST