వాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరి
ABN , First Publish Date - 2020-10-05T03:37:36+05:30 IST
మనం మనిషి బతికున్నప్పుడు ఆ మనిషిని సుఖంగా బతకనివ్వం. చనిపోయేటప్పుడైనా అతనికి ఇష్టం వచ్చినట్లు చావనివ్వం. ఏదైనా చివరి

మనం మనిషి బతికున్నప్పుడు ఆ మనిషిని సుఖంగా బతకనివ్వం. చనిపోయేటప్పుడైనా అతనికి ఇష్టం వచ్చినట్లు చావనివ్వం. ఏదైనా చివరి క్షణాల్లో వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. లేకపోతే అసంతృప్తితో చనిపోతారు. ధైర్యంగా, నిజంగా, నిజాయితీగా, అందంగా బతికినాళ్లు మాత్రమే.. చావుని కూడా డీసెంట్‌గా చూడగలరు.. అని అన్నారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. పూరి మ్యూజింగ్స్‌లో ఆయన డీసెంట్ డెత్ అనే టాపిక్ మీద మాట్లాడారు. మరి అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
"ఒక లివింగ్ ఆర్గనిజంలో బైలాజికల్ ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతే.. దాన్ని డెత్ అంటారు. డెత్ అవగానే బాడీ డికంపోజయ్యి.. పాంచ భౌతికమైన దేహం మళ్లీ పంచభూతాలలో కలిసిపోతుంది. పూర్వం చావుని చూసి మనలాగ భయపడేవారు కాదు. డెత్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్‌లా చూసేవాళ్లు. తమిళనాడులో ఒక రిచ్యుయల్ ఉండేది. దానిపేరు తలైకూత్తల్. అదేంటంటే.. బాగా ఓల్డ్ అయిపోయినాక.. నేను ముసలివాడిని అయిపోయాను. జీవితంలో అన్నీ చూశాను.. ఇంక పిల్లలకు బర్డెన్ అవకూడదు అని డిసైడ్ చేసుకుని, తనకు కావాల్సిన వారందరినీ పిలుచుకుని, మనవళ్లు, మనవరాళ్లు అందరితో రెండు రోజులు గడిపి.. ఆ తర్వాత ఆ రిచ్యుయల్ చేసేవారు. ఈట్స్ లైక్ మెర్సికిల్లీ. ఆ ముసలాయనకి ఉదయాన్నే ఒళ్లంతా ఆయిల్ బాత్ చేయించడం, కొబ్బరినీళ్లు తాగించడం.. వంటి ప్రాసెస్ జరుగుతుంది. అలా చేస్తే.. వాళ్లకి విపరీతమైన జ్వరం వచ్చి.. కిడ్నీ ఫెయిలై.. రెండు రోజుల్లో చచ్చిపోయేవారు. దానినే డీసెంట్ డెత్‌గా భావించేవారు.
అయితే తర్వాత్తర్వాత ఈ రిచ్యుయల్‌ని అడ్డం పెట్టుకుని ఆస్తికోసం ఇంట్లో ముసలివాళ్లని చంపేయడం మొదలుపెట్టారు. దానితో ప్రభుత్వం దీనిని నిషేధించింది. ఇప్పుడది చేస్తే చాలా నేరం. అయితే లైఫ్‌లో డీసెంట్‌గా బతికినవాళ్లే.. చావుని కూడా డీసెంట్‌గా చూడగలరు. ఇండియాలో ఉన్న లా ప్రకారం ఐసీయూలో ఉన్న పేషెంట్‌కి ట్రీట్‌మెంట్ విత్ డ్రా చేయడం లాంటివి చేయకూడదు. గుండె ఆగి చనిపోతే సిపిఆర్ తప్పనిసరిగా చేయాలి. పేషెంట్ చనిపోతాడని డాక్టర్లు చెబుతారు. కానీ పిల్లలు అతనికి చెప్పవద్దని ఆ విషయం దాస్తుంటారు. అతను వాళ్లకి తండ్రో, తాతో అయ్యింటాడు. అతనే వీళ్లందరినీ పెంచాడు. అన్ని కష్టాలూ తెలిసినవాడు. అతను చూడంది కాదు.. ఇలాంటి ఎన్నో చావులు చూసిన మనిషి. అలాంటి మనిషికి మనం నిజం చెప్పకుండా దాస్తుంటాం. చెబితే తప్పేముంది. ముందుగా తెలిస్తే.. ఆయనేదో ప్లాన్ చేసుకుంటాడు కదా.
కానీ అబ్రాడ్‌లో వేరే రూల్స్ ఉన్నాయ్. పేషెంట్ అడ్మిట్ అవ్వగానే.. డాక్టర్‌కి తెలిసిపోతుంది.. బతుకుతాడో? లేదో?. వెంటనే టెర్మినల్ లీవ్ ఈవెంట్ రాసేస్తారు. రాసి వెంటనే పేషెంట్‌కి చెప్పేస్తారు.. నువ్వు చనిపోతున్నావు అని. అతను ఎవరికి చెప్పమంటాడో కనుక్కుని, వాళ్లకి మాత్రమే డాక్టర్లు చెబుతారు. ఒకవేళ అతను ఎవరికీ చెప్పవద్దు అంటే ఎవరికీ చెప్పరు. అలాగే పేషెంట్‌ని అడిగి అడ్వాన్స్ డైరెక్టివ్ రాస్తారు. నేను ఎలా చనిపోదాం అనుకుంటున్నాను? ఎంత వరకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలి? గొట్టాలవీ పెట్టాలా? వద్దా?. సిపిఆర్ చేయాలా? వద్దా?. ఇలాంటి వన్నీ పేషెంట్‌ని అడిగి రాసుకుంటారు. దాన్నిబట్టే ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఎక్కువ సఫరింగ్ లేకుండా.. పేషెంట్‌కి ఇష్టమైన విధంగా.. సుఖంగా ప్రాణాలు వదిలెట్టు.. అక్కడ పేషెంట్ చెప్పే ప్రతి ఓపెనియన్‌కి వేల్యూ ఇస్తారు. ఎందుకంటే చాలా మంది.. నేను అల్రెడీ 95. ఇంకెంతకాలం బతకగలను. పిల్లలకి నేను చేయాల్సింది చేసేశాను. నన్ను మనశ్శాంతిగా పోనివ్వండి అంటారు. ఇక అక్కడి నుంచి వార్డులో ఉన్న డాక్టర్లు, నర్సులతో ఎంతో ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ.. హాయిగా చనిపోతారు. 90 శాతం పీపుల్ ప్రాణాలు నర్సులు, డాక్టర్ల చేతిల్లోనే వదిలేస్తారు. రోజూ చావుని దగ్గరగా చూసేది వాళ్లే.
ఇక్కడ మనం బతికున్నప్పుడు ఆ మనిషిని సుఖంగా బతకనివ్వం. చనిపోయేటప్పుడైనా అతనికి ఇష్టం వచ్చినట్లు చావనివ్వం. ఏదైనా చివరి క్షణాల్లో వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. లేకపోతే అసంతృప్తితో చనిపోతారు. జీవితంలో చివరి క్షణాలు.. వాళ్ల ప్రతి చివరి క్షణం చాలా ఇంపార్టెంట్. వుయ్ మస్ట్ వేల్యూ థెమ్. ధైర్యంగా, నిజంగా, నిజాయితీగా, అందంగా బతికినాళ్లు మాత్రమే.. చావుని కూడా డీసెంట్‌గా చూడగలరు.." అని పూరీ డీసెంట్ డెత్ గురించి చెప్పుకొచ్చారు.