తన మార్క్ చిత్రాలతో.. టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి బుజ్జి
ABN , First Publish Date - 2020-12-25T02:44:08+05:30 IST
'గీతగోవిందం' చిత్రంతో డీసెంట్ హిట్‌ను అందుకోవడమే కాకుండా.. పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు దర్శకుడు

'గీతగోవిందం' చిత్రంతో డీసెంట్ హిట్‌ను అందుకోవడమే కాకుండా.. పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. 'యువత' చిత్రంతోనే ఇండస్ట్రీకి తన మార్క్ చూపించాడు పరశురామ్. అప్పటి నుంచి తన మార్క్ చిత్రాలు తీస్తూ.. తనెంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. యువత లాంటి యూత్‌ఫుల్ హిట్ చిత్రం తరువాత తను మాస్‌మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కించిన 'సారొస్తారు', 'ఆంజనేయులు' చిత్రాలు దేనికదే డిఫరెంట్ జోనర్ లో చిత్రీకరించిన చిత్రాలుగా మంచి గుర్తింపును పొందాయి. అలాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన 'సోలో' చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా హీరో నారా రోహిత్‌కి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. టెలివిజన్‌లో టెలికాస్ట్ అయిన ప్రతిసారి ఈ చిత్రానికి మంచి టీఆర్పీ వస్తుందంటే.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెలుసుకోవచ్చు. పరుశురామ్ బుజ్జి.. దర్శకుడిగా ఫ్యామిలీ ఆడియెన్స్ చెంతకు చేర్చింది 'సోలో' చిత్రమనే చెప్పాలి. ఆ తరువాత అల్లు శిరీష్ హీరోగా రూపొందిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం మరొక్కసారి తన మార్క్‌ని నిలబెట్టింది.
ఇక ఆ చిత్రం తర్వాత మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకం పై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన 'గీతగోవిందం' సినిమాతో పరశురామ్ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరుకున్నారు. ఆ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర పరుశురామ్ సత్తా చూపించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఎమోషన్ యాడ్ చేసి కమర్షియల్ హంగులతో పరుశురామ్.. హీరో విజయ్ దేవరకొండని సెల్యులాయిడ్ పై చూపించిన విధానంకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దర్శకుడుగా పరుశురామ్ బుజ్జిని అగ్రస్థానంలో నిలబెట్టారు. ఇప్పడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో పరశురామ్ 'సర్కారువారి పాట' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 25న దర్శకుడు పరుశురామ్ బుజ్జి పుట్టినరోజు సందర్బంగా ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలంటూ చిత్రప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more