బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామ‌త్ క‌న్నుమూత‌

ABN , First Publish Date - 2020-08-17T18:09:23+05:30 IST

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు.

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామ‌త్ క‌న్నుమూత‌

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న లివ‌ర్ సిరోసిస్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య తిర‌గ‌బెట్ట‌డంతో జూలై 31న ఏఐజీలో ఆయ‌న జాయిన్ అయ్యారు. చికిత్స తీసుకుంటున్నారు. కానీ ప‌రిస్థితి చేయిదాటంతో ఆయ‌న తుది శ్వాస విడిచారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా మ‌ల‌యాళ చిత్రం దృశ్యంను హిందీలో రీమేక్ చేశారు నిషికాంత్ కామ‌త్‌. అంత ముందు ఆయ‌న మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. 

Updated Date - 2020-08-17T18:09:23+05:30 IST