దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి కన్నుమూత
ABN , First Publish Date - 2020-08-08T06:33:47+05:30 IST
సీనియర్ దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి శుక్రవారం గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కుమార్తెను చక్రవర్తి పెళ్లాడారు...

సీనియర్ దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి శుక్రవారం గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కుమార్తెను చక్రవర్తి పెళ్లాడారు. కె.విశ్వనాథ్, బి గోపాల్, కోదండ రామిరెడ్డి, పి.వాసు లాంటి దర్శకుడు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన శోభన్ బాబు ‘సంపూర్ణ ప్రేమాయణం’, బాలకృష్ణ ‘కత్తుల కొండయ్య’, ‘నిప్పులాంటి మనిషి’, రాజేంద్రప్రసాద్ ‘కాష్మోరా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చక్రవర్తి మరణం పట్ల దర్శకుల సంఘం తరుఫున అధ్యక్షుడు ఎన్. శంకర్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read more