డైరెక్టర్‌ మారుతి వదిలిన ‘మాయ’ టీజర్

ABN , First Publish Date - 2020-10-25T23:19:55+05:30 IST

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం 'మాయ'. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా.. రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర

డైరెక్టర్‌ మారుతి వదిలిన ‘మాయ’ టీజర్

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం 'మాయ'. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా.. రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర పాత్రధారులుగా నటించారు. రేస‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌, విఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై గోపికృష్ణ జ‌యంతి నిర్మించారు. ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ ఈ చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ పోస్ట‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చిందని తెలిపింది చిత్రయూనిట్‌.  తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. కొత్త లేడీ డైరెక్టర్ రాధిక జయంతి తీసిన మాయ సినిమా టీజర్ నా చేతుల మీదుగా విడుదల అవ్వడం సంతోషంగా ఉంది. యంగ్ టీమ్ అందరూ చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కొత్త కాన్సెప్ట్స్ తో వస్తోన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, అదే తరహాలో మాయ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను.. అని తెలిపారు.


నిర్మాత గోపికృష్ణ జ‌యంతి‌ మాట్లాడుతూ.. ''టీజర్ విడుదల చేసిన మారుతిగారికి ధన్యవాదాలు. ప్రీ లుక్, ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది. టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పూర్తిగా సినిమా ఇండ‌స్ట్రీ ప‌ట్ల ప్యాష‌నేట్ టీంతో కంప్లీట్‌గా అమెరికాలోని రిచ్ లొకేష‌న్స్‌లో 'మాయ' మూవీని  తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. మేకింగ్‌లో హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో శిక్ష‌ణ తీసుకున్న రాధిక జ‌యంతి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ విజుల‌వ్స్  త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తాయి. పలు లఘు చిత్రాలకి సంగీతం అందించిన ప్రణీత్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఈ మూవీకి త‌న బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ నిస్తుంది" అన్నారు.


ద‌ర్శకురాలు రాధిక జ‌యంతి మాట్లాడుతూ.. ''మా సినిమా టీజర్‌ను విడుదల చేసిన మారుతిగారికి ధన్యవాదాలు. నిర్మాతల స‌హాయంతో అమెరికాలోని రిచ్‌లోకేష‌న్స్‌లో పూర్తి సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. అమెరికాలో సింగ‌ర్‌గా సుప‌రిచితుడు అయిన కార్తిక్ జ‌యంతి ఈ చిత్రానికి క‌థ అందించారు. మిస్ భార‌త్ యుఎస్‌ఏ విన్న‌ర్ సంధ్య టైటిల్‌రోల్ పోషిస్తుండ‌గా ఫ్యాషన్ దివా రోహిణి, అభిషేక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒక డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది. త్వ‌ర‌లోనే ట్రైలర్‌ విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.." అన్నారు. Updated Date - 2020-10-25T23:19:55+05:30 IST

Read more